br

నోరూరించే మిరియాల పొంగలి మీకోసమే......(కేవలం 10 నిమిషాలలో అయిపోతుంది)




మనకి పొద్దున్న లేవగానే ఏదైనా కొత్తగ తినాలనిపిస్తుంది,కాని రోజు తినే ఇడ్లీ లేదా దోస తినవలసి వస్తుంది
అలాంటప్పుడు  ఏమి చెయ్యాలి అని అడిగితే మికోసమేనండి ఈ ఈజీ మరియు రుచికరమైన వంటకం
కేవలం అంటే కేవలం 10 నిమిషాలలో వంట ఐపోతుంది.
మరి ఎలా చెయ్యల్లో చూద్దామా

కావాల్సిన పదార్ధాలు :-

  • బియ్యం- 100 గ్రాములు
  • పెసరపప్పు-75 గ్రాములు
  • మిరియాలు-5 గింజలు
  • కరివేపాకు-4 రెబ్బలు
  • పచ్చి మిరపకాయలు-4
  • జీడిపప్పు-4 పలుకులు
  • ఉప్పు- రుచికి తగినంత
  • పసుపు-చిటికెడు
  • నెయ్యి-2 స్పూన్స్
  • ఎండు మిరపకాయలు-2 మిరపలు

తయారు చెయ్యి విధానం:-

  • మొదటగా రెండు కప్పుల తీసుకుని బియ్యం ఒక 100 గ్రాములు లేదా 75 గ్రాములు పెసరపప్పు తీసుకుని అరగంట నానపెట్టాలి.
  • ఒక గిన్నె తీసుకుని దానిలో నెయ్యి వేసుకుని దానిలో జీడిపప్పు వేసి వేయించాలి.
  • తరవాత పచ్చిమిర్చి,జీలకర్ర,ఆవాలు,ఎండు మిరపకాయలు,పసుపు,కరివేపాకు,పసుపు వేసి వేయించాలి
  • తరవాత నానాబెట్టిన  బియ్యం,పెసరపప్పుని  4 గ్లాస్ లు నీళ్ళు పోసి కొద్దిగా నెయ్యి,ఉప్పు వేసి ఉడికించాలి.
  • ఉడకపెట్టిన అన్నం పెసరపప్పు ఉడికించిన మిశ్రమంలో వేయించిపెట్టిన పోపు దినుసులని దీనిలో కలుపుకుని తినాలి.

About Unknown

0 comments:

Post a Comment

Powered by Blogger.